Share News

T20 World Cup 2026: తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించిన గిల్

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:02 PM

టీ20 ప్రపంచ కప్-2025 భారత జట్టులో వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌‌కు చోటుదక్కని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ఎవరు ఆపలేరు అంటూనే సెలెక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తానని తెలిపాడు.

T20 World Cup 2026: తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించిన గిల్
Shubman Gill

స్పోర్ట్స్ డెస్క్: టీ-20 ప్రపంచ కప్-2026 భారత జట్టులో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌‌(Shubman Gill)కు చోటుదక్కని సంగతి తెలిసిందే. టీమిండియా సెలెక్టర్లు తనను ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై గిల్ తొలిసారి స్పందించాడు. తన విషయంలో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపాడు. భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో బిజీ కానుంది. రేపటి(జనవరి 11) నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్ వ్యవహరిస్తున్న గిల్‌ మీడియాతో మాట్లాడాడు.


శనివారం మీడియా సమావేశంలో గిల్(Shubman Gill)కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. టీ20 జట్టులో చోటు కోల్పోవడంపై మీ అభిప్రాయం ఏంటంటూ మీడియా అడిగింది. ఇందుకు గిల్ స్పందిస్తూ.. ‘సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌. ప్రస్తుతం నేను ఉండాల్సిన చోటే ఉన్నాను . నా విధిలో ఏది రాసి ఉందో దానిని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. ప్రతి ఒక ఆటగాడు ఎప్పుడూ దేశం కోసం తన వంతు కృషి చేస్తానని నమ్ముతాడు. నేను కూడా అంతే. అయితే, సెలెక్టర్లే అంతిమ నిర్ణయం(Team India selectors decision) తీసుకుంటారు’ అని శుభ్‌మన్ గిల్‌ పేర్కొన్నాడు.


ఇక గిల్ టీ20 కెరీర్ విషయానికి వస్తే.. టీ20 ఆసియా కప్‌-2025 ద్వారా గిల్‌ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మకు సూపర్ ఓపెనింగ్‌ జోడీగా ఉన్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ను తప్పించి.. అతడి స్థానంలో గిల్‌ను తీసుకున్నారు. అయితే, వరుస మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఒక్క టీ20 హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోవడం ఇందుకు నిదర్శనం. అయినప్పటికీ ఇటీవల జరిగిన ఆసీస్ పర్యటన, అలానే సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ గిల్‌ను.. తొలి మూడు మ్యాచ్‌లలో కొనసాగించారు. ఇక్కడా అతడు విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అనూహ్య రీతిలో అతడిపై వేటుపడింది.


ఇవి కూడా చదవండి:

జెమీమాతో కలిసి పాడి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గావస్కర్!

అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!

Updated Date - Jan 10 , 2026 | 05:09 PM