Shreyas Iyer: కీలక మ్యాచ్‌లు.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:44 PM
భారత జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ చాలా కాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శ్రేయస్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) చాలా కాలం తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శ్రేయస్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ కంటే ముందు కెప్టెన్ గా ఉన్న శార్ధుల్ ఠాకూర్‌కు పిక్కకు గాయమైంది. దీంతో అతడు ఈ టోర్నీకి దూరం కావడంతో కెప్టెన్ బాధ్యతలు ముంబై క్రికెట్ అసోషియేషన్(ఎంసీఏ) అయ్యర్ కు అప్పగించింది.
ఈ విషయాన్ని ఎంసీఎ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కార్ ధ్రువీకరించారు. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో, జనవరి 8న పంజాబ్‌తో ముంబై తలపడనుంది. ఈ టోర్నీ(Vijay Hazare Trophy 2025-26)లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన ముంబై ఎలైట్ గ్రూప్ సిలో.. 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. హిమచల్‌ప్రదేశ్, పంజాబ్ మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క దాంట్లోనైనా గెలిస్తేనే ముంబై నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది. అలాంటి కీలకమైన ఈ రెండు మ్యాచులకు అయ్యర్(Shreyas Iyer) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఇక అయ్యర్(Shreyas Iyer) ఆరోగ్యం విషయానికి వస్తే... ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తి కడుపు భాగంలో తీవ్ర గాయమైంది. అంతేకాక కడుపులో అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం డిసెంబర్ 25న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో చేరిన శ్రేయస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE)లో హై-ఇంటెన్సిటీ టెస్టులను విజయవంతంగా అతడు పూర్తి చేసుకున్నాడు.
దీంతో అయ్యర్ దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్( Shreyas Iyer Fitness Test) సాధించినట్లే. మరోవైపు త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో అయ్యర్ కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. కానీ ఈ సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే అతడు కివీస్‌తో మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని జట్టు ఎంపిక సందర్భంగా సెలక్టర్లు స్పష్టం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్(Mumbai vs Punjab)తో జరిగే మ్యాచ్‌లు ముంబైతోపాటు.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు కీలకం కానున్నాయి. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడితేనే అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తుంది.
ఇవి కూడా చదవండి:
Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384