Share News

అందరి దృష్టి శీతల్‌పైనే..

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:17 AM

ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్‌ మూడో అంచె టోర్నీ శనివారం ఇక్కడ ప్రారంభం కానుంది. భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 29 మంది ఆర్చర్లతో మన బృందం బరిలో దిగుతోంది. అయితే 19 ఏళ్ల శీతల్‌ దేవిపైనే ప్రధానంగా అందరి దృష్టీ నిలవనుంది.

అందరి దృష్టి శీతల్‌పైనే..

నేటి నుంచి వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌

అహ్మదాబాద్‌: ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్‌ మూడో అంచె టోర్నీ శనివారం ఇక్కడ ప్రారంభం కానుంది. భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 29 మంది ఆర్చర్లతో మన బృందం బరిలో దిగుతోంది. అయితే 19 ఏళ్ల శీతల్‌ దేవిపైనే ప్రధానంగా అందరి దృష్టీ నిలవనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అద్భుత ప్రదర్శనతో మన్ననలు అందుకొంటున్న ప్రపంచ నెంబర్‌ వన్‌ కాంపౌండ్‌ ఆర్చర్‌ శీతల్‌ స్వదేశీ ప్రేక్షకుల మధ్య తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో తలపడుతోంది. బుధవారం వరకు జరిగే ఈ మూడో దశ సిరీస్‌లో పలువురు ప్రపంచ ప్రఖ్యాత ఆర్చర్లు సహా 19 దేశాల నుంచి 109 మంది పోటీపడుతున్నారు. రికర్వ్‌, కాంపౌండ్‌, డబ్ల్యూ1, దృష్టిలోపం ఉన్న వారి విభాగాలలో పోటీలు జరుగుతాయి.

ఈ వార్తలను కూడా చదవండి

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

Updated Date - Sep 05 , 2026 | 01:17 AM