ప్రజా సమస్యలను పరిష్కరించండి: మంత్రి బీసీ
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:29 PM
ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.
బనగానపల్లె, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అర్జీల మీద స్వయంగా సంబంఽధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. రెవిన్యూ, ఇతర సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.