Share News

మరో 30 రోజులు సమ్మె కొనసాగింపు

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:34 PM

తమ సమస్యలు పరిష్కరించే వరకు మరో 30 రోజుల వరకు శాంతియుత సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్టు జేఏసీ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్‌పర్సన్‌ శ్రీదేవి తెలిపారు.

మరో 30 రోజులు సమ్మె కొనసాగింపు
జీజీహెచ్‌లో మానవహారం నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు

కాంట్రాక్టు జేఏసీ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్‌పర్సన్‌ శ్రీదేవి

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించే వరకు మరో 30 రోజుల వరకు శాంతియుత సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్టు జేఏసీ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్‌పర్సన్‌ శ్రీదేవి తెలిపారు. 13వ రోజు సమ్మెలో భాగంగా కర్నూలు ప్రభు త్వ సర్వజన వైద్యశాలలో శుక్రవారం సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ దగ్గర కాంట్రాక్టు ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గురువారం ఏపీ మెడికల్‌ హెల్త్‌ ఎం పాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర ప్రతినిధులు వైద్యఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు మరో 30 రోజులు సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఆన్‌లైన్‌ సేవలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. జేఏసీ నాయకులు భాస్కర్‌ రెడ్డి, నరేంద్ర, కాత్యాయిని, కిరణ్‌, పుష్ప, నాగేంద్ర, శ్రీలక్ష్మీ, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 11:34 PM