టీ20 ప్రపంచ కప్ 2026: రికార్డు సృష్టించిన స్కాట్లాండ్.. ఇటలీపై ఘన విజయం
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:18 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో స్కా్ట్లాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇటలీ.. 16.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో స్కా్ట్లాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇటలీ.. 16.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. బెన్ మనేంటి(52) హాఫ్ సెంచరీ వృథా అయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన స్కాట్లాండ్ జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే(84) ఇటలీ బౌలర్లపై విరుచుపడ్డాడు. మెక్‌ముల్లెన్(41), మైఖేల్ జాన్స్(37), లీస్క్(22) రాణించారు. ఇటలీ బౌలర్లలో అలీ హసన్, స్టీవర్ట్, థామస్, స్మట్స్ తలొక వికెట్ పడగొట్టారు. అయితే టీ20 ప్రపంచకప్(T20 World Cup) చరిత్రలో 200కు పైగా పరుగులు చేసిన తొలి అసోసియేట్ దేశంగా స్కాట్లాండ్ రికార్డు సృష్టించింది.
అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇటలీ.. 134 పరుగులకే కుప్పకూలింది. బెన్ మానేంటి(52) టాప్ స్కోరర్. హ్యారీ మానేంటి(37), స్మట్స్(22) పర్వాలేదనిపించారు. స్కాట్లాండ్ బౌలర్లలో లీస్క్ 4 వికెట్లు తీసి ఇటలీ పతనాన్ని శాసించారు. మార్క్ వాట్ 2, డేవిడ్‌సన్, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా వెస్టిండీస్‌పై ఓడిన స్కాట్లాండ్.. ఇటలీపై గెలిచి తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..