Sara Tendulkar: సచిన్ కూతురిపై ట్రోలింగ్.. మండిపడుతున్న అభిమానులు!
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:25 AM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సచిన్ కూతురుగా పరిచయమై మంచి పాపులారిటీ సంపాదించుకున్న సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్‌గా గోవాలో సారా.. ప్రత్యక్షమైనట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె, వ్యాపారవేత్త అయిన సారా టెండూల్కర్(Sara Tendulkar) సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. దీనికి కారణం.. కొత్త సంవత్సరం వేళ ఆమె గోవా వీధుల్లో తన స్నేహితులతో తిరుగుతున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎప్పుడు రికార్డ్ చేశారో అనే దానిపై స్పష్టత లేదు. కానీ.. కొందరు నెటిజన్లు మాత్రం.. ఇది నూతన సంవత్సర వేడుకల సమయంలో తీసినట్లు చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలో సారా తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుస్తూ కనిపించింది. అయితే.. ఆమె చేతిలో ఒక సీసా పట్టుకుని ఉంది. అది బీర్ బాటిల్ అని ఆరోపిస్తూ కొంతమంది నెటిజన్లు సారా టెండూల్కర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ వ్యవహారంలోకి సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరునూ లాగుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సారా... సచిన్ పరువు తీస్తున్నారంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై మరోవైపు.. సారా(Sara Tendulkar)కు సోషల్ మీడియాలో మద్దతు కూడా లభిస్తోంది. అంతేకాక సచిన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేసేవారిపై ఫైర్ అవుతున్నారు. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడుతున్నారు. 'సారా చేతిలో బాటిల్ ఉంటే.. సచిన్ మద్యం ప్రమోట్ చేస్తున్నట్లు ఎలా అవుతుంది? ఆమె డ్రింక్ తీసుకోకూడదా?' అని ఒక యూజర్ ప్రశ్నించారు. అసలు అది బీరా లేక ఇతర మద్యం బాటిలా అనేది ఎలా చెబుతున్నారంటూ సారాను విమర్శించే వారిపై పలువురు మండిపడుతున్నారు. ఇందులో ట్రోల్ చేయడానికి ఏముందని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఇంకొందరు సారాకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇక సారా విషయానికి వస్తే.. ఆమె కేవలం సెలబ్రిటీ కుమార్తె మాత్రమే కాదు. ఆమె ఒక విద్యావంతురాలు కూడా. లండన్ నుంచి న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెల్‌నెస్ స్టూడియోను కూడా ప్రారంభించారామె. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సారా(Sara Tendulkar)కు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా భారీగా ఆదాయం వస్తోంది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ఆమె క్లీన్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
ఇవీ చదవండి:
Chris Lynn: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
Virat Kohli: 2026 కొత్త ఏడాది వేళ.. విరాట్ ఎమోషనల్ పోస్ట్..