Share News

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రాజీనామాకు సిద్ధమైన ర్యాన్ టెన్..

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:35 PM

టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రాజీనామాకు సిద్ధమైన ర్యాన్ టెన్..
Gautam Gambhir, Ryan ten Doeschate

టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే (Ryan ten Doeschate) తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల రీత్యా బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజీనామాకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా తుది ఆమోదం తెలపలేదని జాతీయ మీడియా వెల్లడించింది.


నెదర్లాండ్స్‌కు చెందిన ర్యాన్ టెన్ రెండేళ్ల క్రితం గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా భారత జట్టుతో పని చేయడం ప్రారంభించారు. ఆయన ఒప్పందం తాజాగా ముగిసినప్పటికీ పొడిగించే అవకాశం ఉంది. అయితే తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లండన్‌లో నివసిస్తున్న తన భార్య, ముగ్గురు పిల్లలతో గడపడం కోసమే ఆయన తన బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం (India coaching staff).


ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి అనుమతి లభిస్తే, భారత జట్టుతో ఇదే ర్యాన్ టెన్ చివరి వారం కావచ్చు. ఇంగ్లండ్‌తో జులై 19న జరిగే మూడో వన్డే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో అతడి చివరి రోజు కావచ్చు. కాగా గౌతమ్ గంభీర్‌, ర్యాన్ టెన్ మధ్య మంచి వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధం ఉంది. భారత జట్టుకు సహాయ కోచ్‌గా ర్యాన్‌ టెన్‌ను ఎంపిక చేయడంలో కూడా గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ర్యాన్ టెన్ రాజీనామాను గంభీర్ ఆమోదిస్తాడో లేదో చూడాలి (England ODI series).


ఇదిలా ఉండగా, ర్యాన్ టెన్ రాజీనామా అంశంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బోర్డు, ప్రధాన కోచ్ ఆమోదం లభించిన తర్వాతే ర్యాన్‌ టెన్ నిష్క్రమణపై తుది నిర్ణయం వెలువడనుంది.


ఇవి కూడా చదవండి..

నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్


యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..

Updated Date - Jul 14 , 2026 | 05:22 PM