ప్లేయర్లు తొలి మ్యాచ్ నుంచే ఫిట్‌గా ఉండాలి.. రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:34 PM
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. పంజాబ్ కింగ్స్ జట్టు సైతం మెగా లీగ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. పంజాబ్ కింగ్స్ జట్టు సైతం మెగా లీగ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘ఇది శిక్షణ. ఇది సన్నద్ధత. మా తొలి మ్యాచ్ నుంచే మేం ఫిజికల్‌గా, టెక్నికల్‌గా, మెంటల్‌గా.. అన్ని విధాలుగా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాం. గతేడాది ప్లేయర్లు జట్టుకు ఏం అందించారు? దేనివల్ల మనం ఒక మంచి జట్టుగా ఏర్పడ్డాం? అనే విషయాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. అయితే మనమందరం పొరపాట్లు చేస్తాం. అందులో తప్పే లేదు. ఈ ప్రయాణంలో నేను కూడా తప్పులు చేస్తాను. మీరందరూ తప్పులు చేస్తారు. క్యాచ్‌లు వదిలేస్తారు. చెత్త షాట్లు ఆడుతారు. చెత్త ఓవర్ వేస్తారు. కానీ మీ గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఉన్నంతకాలం.. మీరు ఒక తప్పు చేసినా, నా దృష్టిలో అది తప్పు కాదు. క్రికెట్‌లో ఇవన్నీ సహజం. అది ఆటలో ఒక భాగం’ అని రికీ పాంటింగ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఒక కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాళ్లు ముందున్నాయి: సౌరభ్ గంగూలీ
ఐపీఎల్ 2026: సూర్యకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి: అశ్విన్