రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:19 PM
హుబ్లీ వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ దుమ్ము రేపింది. 527/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన జమ్మూ జట్టు 584 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ప్రత్యర్థి కర్ణాటకు 585 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: హుబ్లీ వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ దుమ్ము రేపింది. 527/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన జమ్మూ జట్టు 584 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ప్రత్యర్థి కర్ణాటకు 585 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో రోజు హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా నిలిచిన సాహిల్ లోత్రా నేడు 72 పరుగులకు పెవిలియన్ చేరాడు. 20 రన్స్‌తో బ్యాటింగ్‌కు దిగిన అబిద్ ముస్తాక్ మరో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరి వికెట్‌గా యుద్వీర్ సింగ్(30) రనౌట్ అయ్యాడు.
అయితే జమ్మూ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో ఓ శతకం, ఐదు హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం. శుభమ్ పుందిర్(121), హసన్(88), అబ్దుల్ సమద్(61), కన్హిహా వాదవాన్(70), సాహి లోత్రా(72) అద్భుతంగా రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. యుద్వీర్ పాటిల్, విజయ్ కుమార్ వైశాఖ్, శ్రేయస్ గోపాల్, శిఖర్ శెట్టి తలో వికెట్ తీసుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక తడబడుతోంది. 44 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(13), దేవ్‌దత్త్ పడిక్కల్(11), కరుణ్ నాయర్(0), సమరన్ రవిచంద్రన్(0) తీవ్రంగా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్(85*) హాఫ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో శ్రేయాస్ గోపాల్(25*) కొనసాగుతున్నాడు. జమ్మూ బౌలర్లలో అకిబ్ నబీ దార్ 3 వికెట్లతో చెలరేగాడు. సునీల్ కుమార్ ఓ వికెట్ తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్