రజత్ పాటీదార్ విధ్వంసం.. 48 బంతుల్లో 13 సిక్సర్లతో రికార్డు సెంచరీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:23 PM
ఐపీఎల్ రిటెన్షన్‌కు ఒక్కరోజు ముందు రజత్ పాటీదార్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.. 48 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. వీటిలో 13 సిక్సర్లు ఉన్నాయి. దీంతో మధ్యప్రదేశ్‌కు తొలి SMAT సెంచరీ అందించాడు.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 16: ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటీదార్ బ్యాట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సోమవారం న్యూ చండీగఢ్‌లో అసోంతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే అజేయంగా 135 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
రికార్డుల మోత.. 41 బంతుల్లోనే శతకం
కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రజత్ పాటీదార్ , సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ తరఫున శతకం బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు, 8 ఫోర్లు బాదిన అతడు, ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మధ్యప్రదేశ్ బ్యాటర్‌గానూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 8వ ఓవర్లో 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పాటీదార్ , ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 48 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 5 డాట్ బాల్స్ మాత్రమే ఆడటం విశేషం.
శివాంగ్ కుమార్‌తో కలిసి భారీ భాగస్వామ్యం
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివాంగ్ కుమార్‌తో కలిసి పాటీదార్ కేవలం 62 బంతుల్లోనే 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ తరఫున ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. పాటీదార్ సునామీ ఇన్నింగ్స్‌తో మధ్యప్రదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.135)
ఆర్‌సీబీకి శుభవార్త, ఫిట్‌నెస్ సవాళ్లు
గాయాల సమస్యల దృష్ట్యా 50 ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న పాటీదార్ , ఇటీవలే దోహాలో జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ (ఇండియా-ఎ జట్టు) నుంచి తప్పుకున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్‌లో అద్భుత ఫామ్‌ను కనబరుస్తుండటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యానికి పెద్ద ఊరటనిస్తోంది. మంగళవారం (నవంబర్ 17) ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగియనున్న నేపథ్యంలో పాటీదార్ ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకుముందు నవంబర్ 14న కేరళపై జరిగిన మ్యాచ్‌లోనూ అతడు 36 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. రంజీ ట్రోఫీ ఆరంభ దశలోనూ పుదుచ్చేరి, బిహార్ జట్లపై వరుస సెంచరీలు సాధించి జోరు మీదున్నాడు. (Rajat Patidar SMAT
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం