నా సెంచరీ క్రెడిట్ గంభీర్‌కే దక్కుతుంది: గుర్బాజ్
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:00 PM
భారత్‌తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. ఓ వైపు వికెట్లు పడుతున్నా అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ సెంచరీ చేశాడు. అయితే తన ఇన్నింగ్స్‌పై గుర్బాజ్ తాజాగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. 51 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అయితే తన ఇన్నింగ్స్‌పై గుర్బాజ్ తాజాగా స్పందించాడు. ఆ ఆటపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలు ప్రభావం చూపాయని వెల్లడించాడు.
‘ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడినందుకు ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా నా ఆటతీరు చాలా మెరుగైంది. అందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించా. అయితే ఈ ఇన్నింగ్స్‌కు క్రెడిట్ మాత్రం గంభీర్‌కే దక్కుతుంది. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనతో చాలాసేపు మాట్లాడా. అది నా ఆటతీరును మెరుగుపర్చుకోవడంలో చాలా సాయం చేసింది. షాట్ల ఎంపికపై ఆయన నాకు విలువైన సూచనలు చేశారు. నెట్స్‌లో అదే ప్రాక్టీస్ చేశా. ఇప్పుడు ఫలితం వచ్చింది. అందుకే గంభీర్ సర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా. పిచ్ చాలా క్లిష్టంగా ఉంది. స్పిన్‌ను ఆడటం అంత తేలికైన విషయం కాదు. స్పిన్నర్లకు కాస్త టర్న్‌తోపాటు సహకారం లభించింది. నేను మాత్రం పాజిటివ్‌గా ఆడా. కానీ జట్టు ఓడిపోవడంతో చాలా నిరాశకు గురయ్యా’ అని గుర్బాజ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే