Share News

నయనతార ఇంట్లో పీవీ సింధు సందడి.. ఫొటోలు వైరల్!

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:44 PM

భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. ప్రముఖ నటి నయనతార ఇంట్లో సందడి చేసింది. నయన్, ఆమె భర్త విఘ్నేశ్ శివన్.. సింధు దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా విందు ఇచ్చారు.

నయనతార ఇంట్లో పీవీ సింధు సందడి.. ఫొటోలు వైరల్!
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. ప్రముఖ నటి నయనతార ఇంట్లో సందడి చేసింది. నయన్, ఆమె భర్త విఘ్నేశ్ శివన్.. సింధు దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సింధు సోషల్ మీడియాలో పంచుకుంది. ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ పోస్టు పెట్టింది. వారు దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.


‘అందమైన సాయంత్రం. అద్భుతమైన భోజనం. మనస్ఫూర్తిగా సాగిన సంభాషణలు. అంతులేని నవ్వులు. కొన్ని విందులు మనుషుల గురించి మన అభిప్రాయాలనే మార్చేస్తాయి. స్నేహితులుగా వారి ఇంటికి వెళ్లాం. అక్కడ జీవితం, ప్రేమ ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ బయటకు వచ్చే సమయానికి ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరం తెలుసన్న భావనకు వచ్చేశాం. చెన్నై ఇప్పుడు నాకు సొంతింటి లాగా అనిపిస్తోంది. ఈరోజు తర్వాత చెన్నైలో నాకోసం ఎదురుచూసే కుటుంబం ఇంకాస్త పెరిగినట్లు అనిపిస్తోంది. విక్కీ, నయన్.. మీరు నాపై చూపించిన ప్రేమకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సింధు ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. సింధు పోస్టుకు నయనతార, విఘ్నేశ్ శివన్ కూడా ‘మీరిద్దరూ చాలా స్వీట్’ అంటూ స్పందించారు.


ఇవి కూడా చదవండి:

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా

యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా

Updated Date - Sep 05 , 2026 | 12:44 PM