Share News

వైభవ్ కోసమే నా భార్య దులీప్ ట్రోఫీ చూస్తోంది: క్రిస్ శ్రీకాంత్

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:22 AM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వైభవ్.. బ్యాట్, బంతితోనూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

వైభవ్ కోసమే నా భార్య దులీప్ ట్రోఫీ చూస్తోంది: క్రిస్ శ్రీకాంత్
Kris Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వైభవ్.. బ్యాట్, బంతితోనూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కేవలం 15 ఏళ్ల వయసులో తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న వైభవ్.. భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను ఏలే సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. వైభవ్ బ్యాటింగ్‌ కోసం తన భార్య దులీప్ ట్రోఫీని ఆసక్తిగా చూస్తోందని వెల్లడించాడు.


‘వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్‌ను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలి. సరైన విధంగా తీర్చిదిద్దితే అతడు భవిష్యత్తులో సూపర్‌స్టార్ అవుతాడు. వైభవ్ ఏ టోర్నీలో ఆడుతున్నాడని తెలిసినా.. అందరూ వెళ్లి అతడి ఆటను చూస్తారు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వైభవ్ సూర్యవంశీ కోసం అందరూ ఆ టోర్నీలో మ్యాచ్‌లు చూశారు. నా భార్య కూడా అతడి కోసమే దులీప్ ట్రోఫీ చూస్తోంది. వైభవ్ టెస్టు క్రికెట్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగలడు. ప్రపంచ క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారతాడు’ అని క్రిస్ శ్రీకాంత్ వెల్లడించాడు.


అన్ని ఫార్మాట్లలో ఆడగలడు..

‘కేవలం భారీ షాట్లు ఆడుతున్నాడు.. పొట్టి ఫార్మాట్‌లో తప్ప వేరే ఫార్మాట్ క్రికెట్ ఆడలేడని వైభవ్‌పై వచ్చిన విమర్శలను నేను చూశాను. ఈ కుర్రాడి ఆటతీరుని చూసిన తర్వాత కూడా ఉన్నత స్థాయి క్రికెట్ ఆడగలడా? లేదా? అనే సందేహం ఎలా వస్తోంది? వైభవ్ అన్ని ఫార్మాట్లలో ఆడగలడు. ప్రపంచ క్రికెట్‌ను అన్ని ఫార్మాట్లలో ఏలబోతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ మీడియం పేసర్లను ఏమాత్రం ఇబ్బంది పడకుండా వరుస సిక్సర్లతో డీల్ చేస్తున్నాడు. బౌలర్లనే ఓ ఆట ఆడుకుంటున్నాడు’ అని శ్రీకాంత్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. బ్యాకప్‌గా ప్రిన్స్ యాదవ్!

వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్

Updated Date - Sep 05 , 2026 | 09:33 AM