నేను మోసపోయాను.. పృథ్వీ షాపై కాబోయే భార్య సంచలన ఆరోపణలు!
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:45 PM
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతడి గురించి వస్తోన్న ప్రతి రూమర్ నిజమేనంటూ.. పృథ్వీ షా పేరు ఎక్కడా వాడకుండా అతడికి కాబోయే భార్య చేసిన ఆరోపణలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇటీవలే అతడి ప్రియురాలు ఆకృతి అగార్వల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నెట్టింట చేసిన ఓ పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. అతడి గురించి వస్తోన్న ప్రతి రూమర్ నిజమేనంటూ.. పృథ్వీ షా పేరు ఎక్కడా వాడకుండా ఆమె చేసిన ఆరోపణలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
‘నేను ఎన్నో సార్లు మోసపోయాను. అయినా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. జీవితంలో ఓ అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేను ఇదంతా నమ్మలేకపోతున్నా. అవును.. అతడి గురించి సోషల్ మీడియాలో వస్తోన్న ప్రతి రూమర్ నిజమే. అతడి గురించి మీరు చూసింది, విన్నది.. అన్నీ నిజాలే’ అంటూ ఆకృతి ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. అయితే ఇందులో ఎక్కడా పృథ్వీ షా పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ పోస్టు పృథ్వీ షాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై ఆకృతి గానీ, పృథ్వీ షా గానీ అధికారికంగా స్పందించలేదు. అలాగే ఆకృతి ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పృథ్వీని అన్‌ఫాలో చేయలేదు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను కూడా తొలగించలేదు.
ఇదిలా ఉండగా, పృథ్వీ షా క్రికెట్ కెరీర్ కూడా ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో సాగడం లేదు. 2026 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. ఫిట్‌నెస్, పేలవ ఫామ్ కారణంగా అతడు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయితే భారత్ జట్టులోకి తిరిగి రావాలన్న లక్ష్యాన్ని మాత్రం వదల్లేదని ఇటీవల పృథ్వీ షా స్పష్టం చేశాడు. ‘కమ్‌బ్యాక్ గురించి ఆలోచించకపోతే క్రికెట్ ఆడటంలో అర్థం లేదు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి కల. అందుకోసం మరింత కష్టపడుతున్నాను. గత ఏడాది మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు కొంత విరామం తీసుకున్నాను. ఇప్పుడు మునుపటి కంటే మూడింతలు ఎక్కువగా శిక్షణ తీసుకుంటున్నాను. ఇది వెనుకడుగు కాదు.. మరింత బలంగా తిరిగి రావడానికి అవసరమైన విరామం’ అని ఓ సందర్భంలో వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు
సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!