మహిళల టీ20 ప్రపంచ కప్: టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:55 PM
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్‌కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్‌కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూసిన నెదర్లాండ్స్ జట్టు కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లో అటు పురుషులు, ఇటు మహిళలు నాకౌట్‌కు చేరడంలో విఫలమయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళల టీమ్ కూడా నాకౌట్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో పాకిస్థాన్ మహిళలు హ్యాట్రిక్ ఓటములు చవి చూశారు. 2009 ఆరంభ పొట్టి ప్రపంచ కప్ నుంచి బరిలోకి దిగుతున్న పాక్ మహిళల జట్టు.. ఏనాడూ లీగ్ దశ దాటింది లేదు. ఈ సారి కూడా ఆ చెత్త రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమైంది. గ్రూప్-ఎలో ఇప్పటికే పాక్, నెదర్లాండ్స్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా ఆస్ట్రేలియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కాగా సౌతాఫ్రికాతో నేడు భారత్ కీలక పోరులో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారు: కైఫ్
ఫైనల్: సునామీ ఇన్నింగ్స్.. లంక బౌలర్లను వేటాడిన వైభవ్!