Share News

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

ABN , Publish Date - Jan 04 , 2026 | 07:15 PM

భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్ లో ఆడే జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన ప్రొవిజనల్ జట్టును ఇవాళ(ఆదివారం) పీసీబీ ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా‌ను కెప్టెన్ గా పీసీబీ ఎంపిక చేసింది

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్
Pakistan T20 World Cup squad

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌ 2026 జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కప్ కు ఆడే తమ జట్లలను వివిధ దేశాలు ప్రకటించాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాలు ప్రకటించాయి. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ కూడా తమ స్క్వాడ్(Pakistan T20 World Cup squad) ను ప్రకటించింది. 16 మంది సభ్యులతో పాక్ ప్రొవిజనల్‌ జట్టును ఇవాళ (ఆదివారం) పీసీబీ ప్రకటించింది. ఈ క్రమంలో ఓ స్టార్ ప్లేయరుకు స్థానం దక్కగా.. మరో ఆటగాడికి షాక్ తగిలింది.


టీ20 ప్రపంచ కప్ ఆడే పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా‌ను కెప్టెన్ గా పీసీబీ ఎంపిక చేసింది. ఇదే సమయంలో వైస్ కెప్టెన్ ను ప్రకటించలేదు. కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌( Babar Azam) ఎట్టకేలకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బాబర్ ఎంపికతో అతనిపై విమర్శలు చేసే వారికి గట్టి సమాధానం ఇచ్చినట్లు అయింది. ఇలానే స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది(Shaheen Afridi) సైతం ఈ జట్టులో చోటు దక్కింది. అయితే అతని ఫిట్‌నెస్‌పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్‌కు ప్రత్యమ్నాయంగా మరో పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ ఎంపికయ్యాడు. తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతూ షాహీన్ మోకాలికి గాయమైంది.


మరోవైపు గతంలో వైట్-బాల్ కెప్టెన్‌గా ఉన్న మహ్మద్ రిజ్వాన్‌(Mohammad Rizwan)కు జట్టులో దక్కలేదు. అతడి స్థానంలో వికెట్ కీపర్ గా ఉస్మాన్ ఖాన్‌ను ఎంపిక చేసింది. అలానే స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక మెయిన్‌ స్క్వాడ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు. కాగా, టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ గ్రూప్‌-ఏలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్‌లోనే భారత్ కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది.


పాకిస్థాన్ ప్రొవిజనల్ జట్టు:

సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రౌఫ్ , ఫకర్ జమాన్‌, మొహమ్మద్‌ వసీం జూనియర్‌, నసీం షా, అబ్దుల్‌ సమద్‌,సాహిబ్‌జాదా ఫర్హాన్‌, సైమ్‌ అయూబ్‌, సల్మాన్‌ మీర్జా, అబ్రార్‌ అహ్మద్‌



ఇవి కూడా చదవండి:

ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!

Updated Date - Jan 04 , 2026 | 07:30 PM