Share News

రోహిత్ శర్మ ఎప్పుడు విఫలమవుతాడా అని చూస్తున్నారు: మహ్మద్ కైఫ్

ABN , Publish Date - Jul 21 , 2026 | 08:01 PM

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ ఎప్పుడు విఫలమవుతాడా అని చూస్తున్నారు: మహ్మద్ కైఫ్
Mohammad Kaif

ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ వార్తలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ రిటైర్‌మెంట్ నిర్ణయం అతడి చేతుల్లోనే ఉండాలని.. ఆ హక్కు అతడికి మాత్రమే ఉందని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముందు రోహిత్ అంతర్జాతీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడు ఆడకపోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. అయితే లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో రోహిత్ తన పాత ఫామ్‌ను చూపిస్తూ 138 పరుగులతో మెరిశాడు. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.


‘రోహిత్ శర్మ రిటైర్‌మెంట ఎప్పుడు తీసుకోవాలో రోహిత్ శర్మనే నిర్ణయించాలి. అతడికి ఆ హక్కు ఉంది. భారత క్రికెట్ కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. 12 వేల పరుగులు, 34 సెంచరీలు సాధించాడు. కెప్టెన్‌గా ఉన్నంతకాలం భారత్ ఓడిపోకుండా ఎంతో గొప్పగా నడిపించాడు. కూడా వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ నాయకత్వంలో భారత్‌ను ఎవరూ ఓడించలేకపోయారు. కానీ ఇప్పుడు అతడిపై ఎంతో ఒత్తిడి ఉంది. 'రోహిత్ ఇక నీ పని అయిపోయింది.. రిటైర్‌మెంట్ తీసుకో' అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి ఒత్తిడిలోనూ లార్డ్స్‌లో భారత బ్యాటర్లలో ఎవరికీ సాధ్యం కాని సెంచరీ అతడి బ్యాట్ నుంచి వచ్చింది’ అని కైఫ్ పేర్కొన్నాడు.


రోహిత్ శర్మకు మద్దతు ఇవ్వాలి..

‘ఒకవేళ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 'రోహిత్ భాయ్, 2027 ప్రపంచకప్‌లో నాకు మీరు కావాలి' అని బహిరంగంగా చెబితే ఎలా ఉంటుంది? బీసీసీఐ కూడా 'రోహిత్‌పై ఎవరూ వేలెత్తి చూపొద్దు. అతడు ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడనివ్వండి. మేము అతడికి అండగా ఉన్నాం' అని ప్రకటిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం రోహిత్ ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే అతడి వెనుక ఎవరూ నిలబడటం లేదనే భావన ఉంది. అందరూ అతడు ఎప్పుడు విఫలమవుతాడా అని చూస్తున్నారు. కానీ జట్టు, కెప్టెన్, కోచ్ తనకు అండగా ఉన్నారని అతడికి నమ్మకం కలిగితే.. దేశం కోసం హిమాలయాలనైనా అధిరోహించేంత శక్తితో ఆడతాడు. అభిమానులకు ఓ విజ్ఞప్తి.. ఇక నుంచి అందరూ ప్రశాంతంగా ఉండండి. రోహిత్ శర్మను స్వేచ్ఛగా భారత జట్టు కోసం ఆడనివ్వండి’ అని కైఫ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Jul 21 , 2026 | 08:06 PM