పెనాల్టీ మిస్ చేసినందుకు కోపం వచ్చింది: మెస్సి
ABN , Publish Date - Jun 23 , 2026 | 09:51 AM
ఫిఫా ప్రపంచ కప్‌లో ఆస్ట్రియాపై అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి మాట్లాడాడు. మ్యాచ్ ఆరంభంలో పెనాల్టీని వృథా చేసుకున్నందుకు తనపై తనకే కోపం వచ్చిందనని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కప్‌లో 18 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన మెస్సి.. ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి మాట్లాడాడు. మ్యాచ్ ఆరంభంలో పెనాల్టీని వృథా చేసుకున్నందుకు తనపై తనకే కోపం వచ్చిందనని వెల్లడించాడు. అయినప్పటికీ జట్టు విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు.
టెక్సాస్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఆస్ట్రియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మెస్సి రెండు గోల్స్ చేసి జట్టుకు కీలక విజయం అందించాడు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే లభించిన పెనాల్టీ అవకాశాన్ని మెస్సి చేజార్చుకున్నాడు. బంతిని సరిగ్గా కొట్టలేక గోల్‌పోస్ట్ వెలుపలికి పంపించాడు. ఈ విషయంపై మెస్సి స్పందించాడు. ‘పెనాల్టీ మిచ్ చేసుకున్నందుకు నా మీద నాకే చాలా కోపం వచ్చింది. ఆ బంతిని నేను చెత్తగా ఆడాను. కానీ తర్వాత అదృష్టవశాత్తూ పరిస్థితి మార్చగలిగాం. ఆధిక్యం సాధించి మ్యాచ్ గెలిచాం. ఆస్ట్రియా ఆఖరి వరకు పోరాడింది. ఈ ప్రపంచ కప్‌లో ఏ జట్టు అంత సులువుగా ఆటను వదిలేసుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే మా టీమ్ అర్జెంటీనా.. ప్రత్యర్థి జట్టు ఏదైనా ట్రోఫీ గెలవడమే నా ప్రధాన లక్ష్యం’ అని మెస్సి స్పష్టం చేశాడు.
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన మెస్సికి పెనాల్టీలు మాత్రం ఎప్పటినుంచో సవాలుగానే ఉన్నాయి. 2022 ప్రపంచ కప్‌లో పోలాండ్‌పై, 2018 ప్రపంచక ప్‌లోనూ అతడు పెనాల్టీలను వృథా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ముందు కండరాల గాయంతో ఇబ్బంది పడిన మెస్సిపై సందేహాలు వ్యక్తమైనా.. వాటన్నింటికీ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో అల్జీరియాపై హ్యాట్రిక్ నమోదు చేసిన మెస్సి.. ఇప్పుడు ఆస్ట్రియాపై మరో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను నాకౌట్ దశకు చేరువ చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: ఎంబాపె జోరు.. నాకౌట్‌కు ఫ్రాన్స్
వన్డే ప్రపంచ కప్‌లో రో-కో ఆడతారు: కైఫ్