జూనియర్ ఆసియా కప్: ఫైనల్‌కు భారత మహిళా హాకీ జట్టు
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:56 PM
జూనియర్ ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: జూనియర్ ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి భారత అమ్మాయిలకు గట్టి పోటీనే ఎదురైంది. అయినప్పటికీ దక్షిణ కొరియాను భారీ తేడాతో చిత్తు చేసింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటికే పురుషుల హాకీ జట్టు ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.
భారత విజయంలో సుప్రియ కీలక పాత్ర పోషించింది. ఆమె ఏకంగా హ్యాట్రిక్ సాధించి ప్రత్యర్థిని హడలెత్తించింది. సుప్రియ మూడు గోల్స్ చేయగా.. మధు సిదార్, సుఖ్వీర్ కౌర్ చెరో గోల్ సాధించారు. దక్షిణ కొరియా తరఫున యురి జెంగో ఒక్క గోల్ చేసింది.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్‌ను భారత జట్టు ఏకంగా 19-0తో చిత్తు చేసింది. అదే జోరును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. అయితే కొరియా కాస్త ప్రతిఘటించినప్పటికీ భారత అమ్మాయిలు ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. ఈ విజయంతో భారత్ జూనియర్ ఆసియా కప్ టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. మరో సెమీఫైనల్లో చైనా, జపాన్ జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడనుంది.
ఇవి కూడా చదవండి:
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం
యూఎస్ ఓపెన్: టియాఫో చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన బెన్ షెల్టన్