అప్పుడు సచిన్ ఎన్ని పరుగులు చేశాడో కూడా గుర్తులేదు: జో రూట్
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:30 PM
ఇప్పటివరకు 14,278 టెస్టు పరుగులు చేసిన రూట్.. సచిన్ ఆల్ టైమ్ టెస్టు రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సచిన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 15,921 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 14,278 టెస్టు పరుగులు చేసిన రూట్.. సచిన్ కంటే 1,643 పరుగులు వెనుకబడి ఉన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న అతడు.. ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్‌గా సచిన్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య హెడింగ్లీలో జరిగిన ఓ మ్యాచ్‌ను రూట్ తన స్థానిక క్రికెట్ క్లబ్ సభ్యులతో కలిసి చూశాడట. ‘భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ రోజు భారత బ్యాటర్ల విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఒక వికెటే కోల్పోయింది. రాహుల్ ద్రవిడ్ 148, సౌరభ్ గంగూలీ 128 పరుగులతో భారీ స్కోర్లు చేశారు. అప్పుడు టీమ్‌లో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. కానీ అప్పుడు సచిన్ ఎన్ని పరుగులు చేశాడో కూడా నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు. ఇంగ్లండ్ బౌలర్లకు అది చాలా కఠినమైన రోజు. స్థానిక క్రికెట్ క్లబ్ నుంచి తొలిసారి అక్కడికి వెళ్లి మ్యాచ్ చూశాను. రోథర్‌హామ్ టౌన్ తరఫున అండర్-11 జట్టుతో కలిసి మ్యాచ్‌కు వెళ్లాం. అది అద్భుతమైన అనుభవం. సచిన్ అరంగేట్రం తర్వాత దాదాపు పదేళ్లకు ఇంగ్లండ్ జట్టు తరఫున నేను కెరీర్ ఆరంభించాను. ఇప్పుడు అలాంటి దిగ్గజ క్రికెటర్ రికార్డుకు చేరువ కావడం గర్వంగా అనిపిస్తోంది’ అని రూట్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: నేపాల్ చేతిలో అఫ్గానిస్థాన్ చిత్తు.. క్వార్టర్స్ బెర్తుపై ఉత్కంఠ
ఆసియా క్రీడలు: తమిళనాడు అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా