ఉత్కంఠపోరులో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ గెలుపు
ABN , Publish Date - Jun 15 , 2026 | 10:03 AM
ఫిఫా ప్రపంచకప్ 2026లో సోమవారం తొలిసారి ఉత్కంఠభరిత పోరు జరిగింది. గ్రూప్-ఈలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో సంచలన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఈలో ఈక్వెడార్, ఐవరీ కోస్ట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 1-0 తేడాతో ఐవరీ కోస్ట్ సంచలన విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఐవరీ కోస్ట్ మిడ్ ఫీల్డర్ అమడ్ డియాల్లో గోల్ కొట్టడంతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. దీంతో 19 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈక్వెడార్‌కు ఐవరీకోస్ట్ బిగ్ షాకిచ్చినట్లు అయింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఆట ప్రారంభం నుంచి ఇరుజట్లు పోటాపోటీగా తలపడ్డాయి. తొలి అర్ధ భాగంలో ఈక్వెడార్ పదే పదే అటాకింగ్ గేమ్ ఆడి ఐవరీకోస్ట్‌ను భయపెట్టింది. అంతేకాదు ఈక్వెడార్ రెండుసార్లు క్రాస్‌బార్‌ను తాకినప్పటికీ ఐవరీ కోస్ట్ గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకోవడంతో గోల్స్ రాలేదు. రెండో అర్ధ భాగంలో కూడా గోల్ కోసం ఇరుజట్లు చేసిన చాలా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న అందరూ భావించారు.
చివరి నిమిషంలో ఊహించని పరిణామం చోటుచేసుకుది. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా.. 90వ నిమిషంలో ఐవరీ కోస్ట్ మిడ్‌ఫీల్డర్ అమడ్ డియాల్లో గోల్ కొట్టడంతో ఆ జట్టు బోణీ కొట్టింది. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైమ్‌లో ఈక్వెడార్ గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఐవరీ కోస్ట్ ఖామమైంది. ఈ విజయంతో 3 పాయింట్లతో ఐవరీ కోస్ట్ టోర్నీలో బోణీ కొట్టగా, ఈక్వెడార్ ఇంకా ఖాతా తెరవలేదు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్‌ను వెల్లడించిన కోచ్ మనీష్