Share News

భారత్‌తో ఐదో టీ20: టాస్ నెగ్గిన విండీస్.. నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:03 PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన విండీస్ కెప్టెన్ షై హోప్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

భారత్‌తో ఐదో టీ20: టాస్ నెగ్గిన విండీస్.. నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ
India vs West Indies 5th T20

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన విండీస్ కెప్టెన్ షై హోప్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. వర్షం కారణంగా 7 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్ బాగా ఆలస్యమైంది. దీంతో ఆటను 9 ఓవర్లకు కుదించారు. 2.4 ఓవర్లు పవర్ ప్లే ఉండనుంది. కాగా నాలుగేళ్ల తర్వాత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారో చూడాల్సి ఉంది.


భారత్ తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్

విండీస్ తుది జట్టు:

షై హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), జెవెల్ ఆండ్రూ, షిమ్రోన్ హెట్‌మయెర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, రోస్టన్ ఛేజ్, కీమో పాల్, షమార్ స్ప్రింగర్, గుడాకేశ్ మోతీ, షమార్ జోసెఫ్


ఇవి కూడా చదవండి:

రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్.. పంజాబ్ తరఫున బరిలోకి..!

భారత్-విండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. భువీ రీఎంట్రీకి బ్రేక్ పడనుందా?

Updated Date - Oct 17 , 2026 | 09:14 PM