సీఎస్కే తదుపరి హెడ్ కోచ్‌గా హేమంగ్ బదాని?
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:21 PM
సీఎస్కే తదుపరి హెడ్ కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానిని ప్రధాన కోచ్‌గా నియమించుకునేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పలు కీలక మార్పులకు ఫ్రాంచైజీ సిద్ధమవుతోంది. సీఎస్కే తదుపరి హెడ్ కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానిని ప్రధాన కోచ్‌గా నియమించుకునేందుకు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ.. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీని వీడిన సంగతి తెలిసిందే.
సీఎస్కే కీలక యాజమాన్య సభ్యులు ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఉండి గత సీజన్ల ప్రదర్శనపై సమీక్ష చేస్తున్నారని, భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తున్నారని సమాచారం. ఫ్లెమింగ్ స్థానంలో కొత్త హెడ్ కోచ్‌ను నియమించడంతో పాటు మొత్తం కోచింగ్ సిబ్బందిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 వన్డేలు, నాలుగు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హేమంగ్ బదాని ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీఎస్కే కొత్త ప్రణాళికలకు అతడు సరైన ఎంపిక కావచ్చని ఫ్రాంచైజీ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో ప్లేయర్‌గా సీఎస్కేలో చేరిన ఫ్లెమింగ్.. 2009లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి చెన్నై జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఫ్లెమింగ్ మార్గదర్శకత్వంలో సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు.. 10 ఐపీఎల్ ఫైనల్స్‌లో భాగమైంది. అయితే గత మూడు సీజన్లుగా సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోవడంతో జట్టు వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తాయి. వయసు మీద పడిన ఆటగాళ్లపై అధికంగా ఆధారపడటం, ధోని చుట్టూ జట్టు ప్రణాళికలు తిరగడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సీజన్‌లో ధోని గాయం చుట్టూ నెలకొన్న అనిశ్చితి కూడా జట్టుపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్ వారసుడిగా కొత్త ఆలోచనలు, వ్యూహాలతో ముందుకు వెళ్లే కోచ్ కోసం సీఎస్కే చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై.. 18 ఏళ్ల ప్రయాణానికి తెర
ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026: భారత్‌కు ఐదు స్వర్ణాలు