Share News

ఐపీఎల్ 2026: కీలక పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్

ABN , Publish Date - May 29 , 2026 | 07:02 PM

ఐపీఎల్ 2026లో భాగంగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ 2లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: కీలక పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్
Gujarat vs Rajastha

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ 2లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు టాస్‌ను రెండుసార్లు వేశారు. గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌ గిల్‌ మొదట కాయిన్‌ను గాల్లోకి విసిరాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ హెడ్స్‌ చెప్పాడో.. టెయిల్స్‌ చెప్పాడో సరిగా వినిపించలేదని మ్యాచ్‌ రిఫరీ మరో సారి గిల్‌తో టాస్‌ వేయించాడు. ఈ సారి రాజస్థాన్‌ కెప్టెన్‌ హెడ్స్‌ చెప్పడం.. అదే పడటం జరిగింది.


చండీగఢ్‌‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే, రెండు రోజుల క్రితం ఎస్ఆర్ హెచ్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పేసర్లు రాణించారు. ఆ మ్యాచ్‌లో పడిన 18 వికెట్లలో, 12 వికెట్లు పేసర్లకే దక్కగా, ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ తన లెంగ్త్, వేగాన్ని ఉపయోగించి హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.


తుది జట్టు:

రాజస్థాన్‌ రాయల్స్‌:

యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌), రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), ఫెరీరా, డాసున్‌ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్‌, నాంద్రే బర్గర్‌, బ్రిజేశ్‌ శర్మ, యశ్‌ రాజ్‌ పుంజా

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ల: శుభమ్‌ దూబె, సుశాంత్‌ మిశ్రా, అమన్‌ రావ్‌, రవి బిష్ణోయ్‌, తుషార్‌ దేశ్‌పాండే

గుజరాత్‌ టైటాన్స్‌:

సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), నిశాంత్‌ సింధు, వాషింగ్టన్‌ సుందర్‌, జేసన్‌ హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌, సాయి కిశోర్‌, కగిసో రబాడా, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు: రాహుల్‌ తెవాతియా, గ్లెన్‌ ఫిలిప్స్‌, అనుజ్‌ రావత్‌, కుమార కుశాగ్ర, అర్షద్‌ ఖాన్‌

Updated Date - May 29 , 2026 | 07:25 PM