Share News

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీఫైనల్స్‌‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 08:42 AM

ఫిఫా ప్రపంచకప్‌2026లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొరాకోను ఫ్రాన్స్‌ 2-0 తేడాతో ఓడించింది.

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీఫైనల్స్‌‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్‌
France beat Morocco

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌ (FIFA World Cup 2026)లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ(గురువారం) జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొరాకోను ఫ్రాన్స్‌ 2-0 తేడాతో ఓడించింది. ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కిలియన్‌ ఎంబాపె ఈ మ్యాచ్‌లోనూ ఓ గోల్‌ చేశాడు. అలానే మరో ప్లేయర్ డెంబెలె మరో గోల్‌ కొట్టి.. ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్స్‌లోనూ ఫ్రాన్స్ ఇదే స్కోరుతో మొరాకోను ఓడించింది.


మంగళవారం డాలస్‌లో జరిగే సెమీఫైనల్స్‌లో స్పెయిన్ లేదా బెల్జియంతో ఫ్రాన్స్‌ ఆడనుంది. ఇవాళ రాత్రి జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్పెయిన్, బెల్జియం జట్లు తలడనున్నాయి. గెలిచిన జట్టుతో ఫ్రాన్స్ ఢీకొట్టనుంది. ఇక మొరాకోపై సాధించిన గోల్‌తో ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక గోల్స్‌ చేసిన అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సి (8) సరసన ఎంబాపె(Kylian Mbappe) నిలిచాడు. 60వ నిమిషంలో ఎంబాపె చేసిన ఈ గోల్.. అతడి ప్రపంచకప్ కెరీర్‌లో 20వది కావడం విశేషం. ఇక లియోనెల్ మెస్సి ఖాతాలో 21 గోల్స్‌ ఉన్నాయి. ఇంకొక్క గోల్ చేస్తే.. ప్రపంచ రికార్డులో మెస్సి సరసన ఎంబాపె చేరుతాడు. సెమీ ఫైనల్స్ ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్

లార్డ్స్‌లో చారిత్రక ఘట్టం

Updated Date - Jul 10 , 2026 | 09:27 AM