Share News

ఒలింపిక్‌ భవన్‌ సరికొత్త హంగులతో..

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:06 AM

ఎందరో తెలుగు క్రీడాకారులకు పుట్టినిల్లుగా నిలిచిన తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌ను తన చేతులమీదుగా ప్రారంభించడంపై భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష హర్షం వ్యక్తం...

ఒలింపిక్‌ భవన్‌ సరికొత్త హంగులతో..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఎందరో తెలుగు క్రీడాకారులకు పుట్టినిల్లుగా నిలిచిన తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌ను తన చేతులమీదుగా ప్రారంభించడంపై భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఆధునీకరించిన తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌ను, అక్కడ ఏర్పాటు చేసిన హాకీ దిగ్గజం.. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ విగ్రహాన్ని క్రీడామంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నవంబరులో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ను విజయవంతం చేయాలని క్రీడా సంఘాలకు సూచించారు. క్రీడామంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఆటలే ప్రపంచంగా బతికే సంకల్పం ఉంటేనే క్రీడల వైపు రండి కానీ, టైం పాసు చేసేందుకు రావద్దని హితవు పలికారు. దిగ్గజాలు మిల్కాసింగ్‌, పీటీ ఉష వార్తలను దినపత్రికల్లో చదవి, వారిని స్ఫూర్తిగా తీసుకొని తాను క్రీడాకారుడిగా మారానని తెలిపారు. తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సురేష్‌ రెడ్డి, రవిచంద్ర, దామోదర్‌ రావు, ఎంపీలు ఈటెల రాజేందర్‌, అయోధ్య రామిరెడ్డి, అరబిందో, ఎంఎ్‌సఎన్‌ సంస్థలు ఇచ్చిన నిధులతో రూ.1.25 కోట్లు పెట్టి ఒలింపిక్‌ భవన్‌ను ఆధునీకరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాట్‌ చైర్మన్‌ కె.శివసేనా రెడ్డి, వీసీ-ఎండీ సోనీబాలదేవి, సైబరాబాద్‌ సీపీ రమేష్‌ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు పుల్లెల గోపీచంద్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

Updated Date - Jul 10 , 2026 | 05:06 AM