Share News

Shapoor Zadran: మృత్యువుతో పోరాడుతున్న స్టార్ ప్లేయర్.. పరిస్థితి విషమం..

ABN , Publish Date - Jan 16 , 2026 | 05:46 PM

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టులో ఒకప్పుడు నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్.. ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. జద్రాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

Shapoor Zadran: మృత్యువుతో పోరాడుతున్న స్టార్ ప్లేయర్.. పరిస్థితి విషమం..
Shapoor Zadran health

స్పోర్ట్స్ డెస్క్: ఒకప్పుడు నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించిన మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మృత్యువుతో పోరాడుతున్న ఆ వ్యక్తి అఫ్గానిస్థాన్ మాజీ ఫాస్ట్ పేసర్ షాపూర్ జద్రాన్(Shapoor Zadran).


అఫ్గానిస్థాన్ క్రికెట్ వర్గాల(Afghanistan cricketers) సమాచారం ప్రకారం.. షాపూర్ శరీరంలో తెల్ల రక్తకణాల స్థాయి ప్రమాదకరంగా పడిపోయింది. దీనివల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నాడు. షాపూర్ ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న ఫొటోలను ఆయన సోదరుడు సోషల్ మీడియాలో చేశాడు. అంతేకాక ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానులను విజ్ఞప్తి చేశాడు. షాపూర్ జద్రాన్ అనారోగ్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్(Rashid Latif reaction) స్పందించాడు. షాపూర్ ఎప్పుడూ మైదానంలో సింహంలా పోరాడేవాడని, ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా ప్రార్థిద్దామని కోరాడు. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వంటి సహచర ప్లేయర్లు కూడా షాపూర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.


జద్రాన్ క్రికెట్ కెరీర్..

అఫ్గానిస్థాన్ క్రికెట్‌ ప్రాచుర్యం పొందడంలో షాపూర్‌ కృషి ఎంతో ఉంది. ప్రపంచకప్‌ 2015లో స్కాట్లాండ్‌పై ఆయన సాధించిన విజయం అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జద్రాన్ మొత్తం 80 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. 44 వన్డేల్లో 44 వికెట్లు తీశారు. ఆయన అత్యుత్తమ ప్రదర్శన 4/24. అలానే టీ20 కెరీర్లో 36 ఇన్నింగ్స్‌లో 27 వికెట్లు సాధించాడు. పొడవాటి జుట్టుతో, వేగవంతమైన రనప్‌తో బౌలింగ్ చేసే షాపూర్ ఆ దేశ క్రికెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?

బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్

Updated Date - Jan 16 , 2026 | 06:08 PM