ప్రపంచ కప్‌లో మొట్టమొదటి పాయింట్ సాధించిన కెనడా
ABN , Publish Date - Jun 13 , 2026 | 08:18 AM
ఫిఫా వరల్డ్ కప్2026లో భాగంగా టొరంటో వేదికగా కెనడా, బోస్నియా మధ్య జరిగిన గ్రూప్ బి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా టొరంటో వేదికగా కెనడా, బోస్నియా దేశాలు తలపడ్డాయి. గ్రూపు-బిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ డ్రాతో కెనడా తన ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే మొట్టమొదటి పాయింట్‌ను సాధించింది. 1986 మెక్సికో ప్రపంచ కప్ , 2022 ఖతార్ ప్రపంచ కప్‌ల్లో గ్రూప్ దశలోనే కెనడా మూడు ఓటములను చవిచూసింది. చివరకు తన మూడవ ప్రయత్నంలో ప్రపంచ కప్ 2026లో బోస్నియాతో మ్యాచ్ డ్రా కావడంతో మొదటిసారి పాయింట్‌ను సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆట ప్రారంభమైన 21వ నిమిషంలో బోస్నియా ఫార్వర్డ్ ఆటగాడు జోవో లుకిచ్ కార్నర్ కిక్ ద్వారా గోల్ చేసి తన జట్టును 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 78 నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కెనడా ప్లేయర్ సైల్ లారిన్ అదిరిపోయే గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు.
తొలి అర్ధ భాగంలోనే కెనడా స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్ గోల్ చేసేందుకు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అదేవిధంగా రెండవ అర్ధభాగంలో బోస్నియా కెప్టెన్ సియాద్ కొలాసినాక్ కొట్టిన బంతి క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి వచ్చింది. దీంతో ఆ జట్టు కూడా ఆధిక్యం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. కాగా ఈ టోర్నీని మెక్సికోలో నిర్వహిస్తుండగా.. కెనడా సహా ఆతిథ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం