Share News

ఇంధన కొనుగోలు.. మా ఇష్టం: జైశంకర్‌

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:23 AM

రష్యా ముడి చమురును కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పికొట్టారు...

ఇంధన కొనుగోలు.. మా ఇష్టం: జైశంకర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 12: రష్యా ముడి చమురును కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పికొట్టారు. రష్యా చమురును కొంటున్నందుకు ప్రశ్నిస్తున్న ఆ దేశాలు.. భారత్‌ ప్రత్యర్థులకు అనేక ఏళ్లుగా ఆయుధాలను విక్రయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరుగుతున్నాయన్నారు. అయితే ఇదే సమయంలో భారత ఆయుధాలతో ఇప్పటి వరకు ఏ యూరప్‌ దేశంపైనా దాడి జరగలేదని జైశంకర్‌ స్పష్టం చేశారు. ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని భారత్‌ను అమెరికా కోరిందని గుర్తు చేశారు. ఫిన్‌లాండ్‌లో గురువారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అక్కడ తనకు ఎదురైన ప్రశ్నలకు ఘాటైన సమాధానాలు ఇచ్చారు. ఆంక్షలు, వాణిజ్యం, ఇంధన భద్రత విషయంలో పశ్చిమ దేశాల విధానాల్లో వైరుధ్యాలను ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 06:23 AM