వైభవ్ సూర్యవంశీకి మరో లగ్జరీ కారు.. ఐపీఎల్ అవార్డుతో..
ABN , Publish Date - Nov 09 , 2026 | 10:56 AM
ఐపీఎల్ 2026లో 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డు గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీకి టాటా సియెర్రా ఎస్‌యూవీ లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌కు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుతమైన ప్రదర్శనకు గాను 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డును గెలుచుకున్నాడు. తాజాగా ఆ అవార్డుకు సంబంధించి టాటా మోటార్స్ అందించిన సరికొత్త టాటా సియెర్రా ఎస్‌యూవీ (Tata Sierra SUV) కారును వైభవ్ సొంతం చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌కి వెళ్లి మరీ ఈ లగ్జరీ కారు డెలివరీ తీసుకోవడం విశేషం. క్రికెట్ పిచ్‌లపై ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారిన వైభవ్, ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించి 'ఆరెంజ్ క్యాప్'ను కైవసం చేసుకున్నాడు.
ఈ టోర్నీలో ఏకంగా 63 ఫోర్లు, 72 సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అతని నిలకడైన, దూకుడుగా ఆడే శైలియే అతడికి ఈ అవార్డు గెలిచేలా చేసింది. వైభవ్‌కు కార్లు బహుమతిగా రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ తన అరంగేట్రంతోనే అదరగొట్టి 'సూపర్ స్ట్రైకర్' అవార్డును దక్కించుకున్నప్పుడు అతడికి 'టాటా కర్వ్ ఈవీ' (Tata Curvv EV) బహుమతిగా లభించింది. ఇలా చిన్న వయసులోనే వరుసగా లగ్జరీ కార్లను తన గ్యారేజీలో చేరుస్తూ ఈ యువ క్రికెటర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా వైభవ్ తన సత్తా చాటాడు. గత జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతున్న ఈ బీహార్ కుర్రాడు, దేశీయ క్రికెట్‌లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇవీ చదవండి:
'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్ దీప్కే జోస్యం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం
‘పనులను అడ్డుకుంటే ఊరుకోం’.. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యపై బండి సంజయ్ వార్నింగ్