Share News

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్: జోరు పెంచిన ఇంగ్లాండ్ బ్యాటర్లు

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:09 PM

అండర్-19 ప్రపంచ కప్-2026లో భాగంగా 412 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు పోరాడుతోంది. ఆరంభంలో నిదానంగా ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు.. 10 ఓవర్ల తర్వాత జోరు పెంచారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది.

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్:  జోరు పెంచిన ఇంగ్లాండ్ బ్యాటర్లు
England

స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌(World Cup-2026)లో ఇంగ్లాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 412 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు పోరాడుతుంది. ఆరంభంలోనే ఇంగ్లీష్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. 19 పరుగుల వద్ద అంబరీష్ బౌలింగ్‌లో జోసెఫ్ మూర్స్ పెవిలియన్ చేరాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ మేయెస్ తో కలిసి మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ స్కోర్ బోర్డును కదిలించాడు.


ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డాకిన్స్.. దూకుడుగా ఆడుతున్నారు. మరో ఎండ్ లో ఉన్న మేయెస్ సైతం భారత్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేసిన మేయెస్ ఖిలాన్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాసేపు ఈ ఇద్దరు ఇంగ్లీష్ బ్యాటర్లు జోరు పెంచి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక మేయెస్ తర్వాత వచ్చిన థామస్ రెవ్ (18 బంతుల్లో 31 పరుగులు) చాలా తక్కువ సమయమే క్రీజులో ఉన్నప్పటికీ దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ స్కోర్ 142 పరుగుల వద్ద కాన్షిక్ చౌహాన్ బౌలింగ్ లో ఆయుష్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి.. థామస్ పెవిలియన్ చేరాడు. 20 ఓవర్ల ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాడ్ జట్టు 171 పరుగులు చేసింది.


ఇవీ కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

Updated Date - Feb 06 , 2026 | 07:25 PM