తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:24 PM
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 267 స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన నార్త్ జోన్.. 297 పరుగులకే ఆలౌటైంది. అనంతరం181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ తిలక్ వర్మ (51*) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. రవిచంద్రన్ స్మరన్ (32*) తిలక్ వర్మకు సపోర్టుగా నిలిచి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (116 నాటౌట్; 250 బంతులు) శతకంతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 312 పరుగులు చేసి.. 117 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ గెలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
‘జీవితం పరుగుపందెం కాదు’.. ఐఐటీ గౌహతి విద్యార్థులకు సీఎం కీలక సందేశం
బస్సు బోల్తా 16 మంది మృతి.. 28 మందికి గాయాలు