వృద్ధురాలికి సన్ గ్లాసెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి విజయ్..
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:48 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సేలం జిల్లా పర్యటన సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ ఓ వృద్ధురాలికి 40 వేల రూపాయలు విలువ చేసే తన సన్ గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సేలం జిల్లా పర్యటన సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ ఓ వృద్ధురాలికి 40 వేల రూపాయలు విలువ చేసే తన సన్ గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. స్వయంగా ఆయన చేతులతోటే వృద్ధురాలికి సన్ గ్లాసెస్ తొడిగారు. ఆ వివరాల్లోకి వెళితే.. మెట్టూర్ డ్యామ్ గేట్లు తెరిచి, వరి రైతులకు సాగు నీరు అందించటం కోసం సీఎం విజయ్ మంగళవారం సేలం జిల్లాకు వెళ్లారు. మెట్టూర్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్‌ను పరిశీలించిన తర్వాత చెన్నై తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్ హౌస్ దగ్గర సీఎం ఆగారు. ఫామ్ హౌస్ వద్ద ఉన్న జనాన్ని పలకరించి మాట్లాడారు. ముఖ్యమంత్రి వచ్చాడని తెలియగానే పక్కనే ఉన్న పొలాల్లో పని చేసుకుంటున్న వృద్ధురాళ్లు పరుగు,పరుగున అక్కడికి వచ్చారు. చెల్లమ్ అనే వృద్ధురాలు సీఎం విజయ్ దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకుంది. ఆ తర్వాత తలపై చేతులు పెట్టి ఆశీర్వదించింది. ముఖ్యమంత్రి విజయ్ ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
అక్కడున్న వారందరికీ నూతన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. సీఎం విజయ్ అక్కడినుంచి వెళ్లిపోతున్న సమయంలో చెల్లమ్ ఆయన చెయ్యి పట్టుకుని నడిచింది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఖరీదైన డియోర్ సన్ గ్లాసెస్ చెల్లమ్‌కు బహుమతిగా ఇచ్చారు. స్వయంగా ఆయన చేతులతోటే వృద్ధురాలికి సన్ గ్లాసెస్ తొడిగారు. విజయ్ సన్ గ్లాసెస్ తొడగటంతో చెల్లమ్ ఎంతో సంతోషించింది. విజయ్‌తో పాటే ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ కారు వరకు వచ్చింది. ఆయనను దగ్గరుండి మరీ సాగనంపింది.
ఇవి కూడా చదవండి
GSLV-F17 ప్రయోగం.. విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
అఫ్గాన్ సిరీస్: సంజు వచ్చాడు.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కేనా..?