Share News

GSLV-F17 ప్రయోగం.. విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:38 PM

నెల్లూరు శ్రీహరికోటలో ఈ నెల 4న జరగనున్న GSLV-F17 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ సూళ్లూరుపేటలోని గ్రామదేవత శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

GSLV-F17 ప్రయోగం.. విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు
ISRO Chairman Narayanan

నెల్లూరు: సూళ్లూరుపేట గ్రామదేవత శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ దర్శించుకున్నారు. షార్‌ నుంచి చేపట్టనున్న GSLV-F17 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి GSLV-F17 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఉపగ్రహాన్ని సుమారు 28,934 కిలోమీటర్ల ఎత్తులోని GTO ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రయోగానికి 27 గంటల ముందు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. EOS-05 ఉపగ్రహం భారత భూభాగాన్ని పరిశీలించనుంది. ఈ ఏడాదిలో చేపట్టనున్న ప్రయోగాల్లో ఇది తొలి ప్రయోగమని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఏడు రాకెట్‌ ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. అక్టోబర్‌ నెలలో మరో రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. GSLV-F17 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్‌ దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Also Read:

అఫ్గాన్ సిరీస్: సంజు వచ్చాడు.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కేనా..?

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ

Updated Date - Sep 02 , 2026 | 01:46 PM