దిశా సాలియన్ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశం..
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:30 AM
దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తండ్రి సతీష్ సాలియన్ గత సంవత్సరం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై జస్టిస్ సారంగ్ కోట్వాల్, జస్టిస్ రంజీత్‌సిన్హా రాజా భోసలేలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 28వ తేదీన విచారణను ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ బుధవారం తీర్పును వెలువరించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సతీష్ సాలియన్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థకి తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నేరస్తులుగా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
సీఎస్కే కోచ్ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్
భూ భారతి రిజిస్ట్రేషన్లకు మోక్షం ఎన్నడు?