Share News

టీమిండియాకు దూరంగా ఉండటం బాధగా ఉంది: సూర్య

ABN , Publish Date - Nov 29 , 2026 | 07:53 PM

వరుసగా ఐదేళ్లపాటు జాతీయ జట్టుకు ఆడిన తర్వాత ఒక్కసారిగా చోటు కోల్పోవడం తనకు బాధ కలిగించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అయితే, క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులు సహజమని, ఆటగాడికి ఎన్నో విషయాలు నేర్పిస్తాయని తెలిపాడు.

టీమిండియాకు దూరంగా ఉండటం బాధగా ఉంది: సూర్య
Suryakumar Yadav

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో స్థానం దక్కకపోవడంపై తాజాగా సూర్య కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా ఐదేళ్లపాటు జాతీయ జట్టుకు ఆడిన తర్వాత ఒక్కసారిగా చోటు కోల్పోవడం తనకు బాధ కలిగించిందని అన్నాడు. అయితే, క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులు సహజమని, ఆటగాడికి ఎన్నో విషయాలు నేర్పిస్తాయని పేర్కొన్నాడు.


సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..‘టీమిండియా దూరంగా ఉండటం బాధాకరం. వరుసగా ఐదేళ్లపాటు ఆడి ఆపై అకస్మాత్తుగా భారత్ తరఫున ఆడలేకపోవడం బాధగా ఉంది. కానీ, క్రికెట్ అనేది చాలా విషయాలు నేర్పిస్తుంది. గత రెండేళ్లలో ఐపీఎల్ తర్వాత కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఒకటి ఉంటుంది. ఆ నమ్మకంతోనే కెరీర్ కొనసాగించాలి. భవిష్యత్తు గురించి ఎక్కువఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లపైనే ఉంది' అని సూర్య పేర్కొన్నాడు.


'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రతి మ్యాచ్‌లో గెలిచి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నా బ్యాటింగ్‌లో ఎలాంటి లోపం లేదు. గత ఐదేళ్లుగా ఇదే తరహాలో ఆడుతున్నా. భారత్‌కు ఆడినా, ముంబైకి ఆడినా నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాను. ప్రస్తుతం కూడా అదే పని చేస్తున్నా. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చాలా బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉంటుందని అనుకుంటున్నా. గత 8 నుంచి 10 వారాలుగా నేను శ్రమించాను. దానికి ఫలితం ఇప్పుడు మైదానంలో కనిపిస్తోంది. మనం ఎంత కష్టపడితే అంత అదృష్టం కలిసి వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి ఇప్పుడు నేను అదృష్టవంతుడినని భావిస్తున్నాను’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.


సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో 2024 టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండు అర్ధ శతకాలు సాధించాడు.


ఇవి కూడా చదవండి:

సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ సంగీత విభావరి విజయవంతం

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నిక..

Updated Date - Nov 29 , 2026 | 07:53 PM