డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది: చింతా మోహన్
ABN , Publish Date - Nov 29 , 2026 | 07:04 PM
డీలిమిటేషన్ బిల్లుపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి కేవలం 200 సీట్లు, ఉత్తర భారతదేశానికి 600కు పైగా సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తిరుపతి, నవంబర్ 29: డీలిమిటేషన్ బిల్లుపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి కేవలం 200 సీట్లు, ఉత్తర భారతదేశానికి 600కు పైగా సీట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ కారణంగా దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి అధిక ఆదాయం సమకూరుతున్నప్పటికీ, రాజకీయంగా ఆ రాష్ట్రాలు బలహీనపడుతున్నాయని చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భవిష్యత్తులో దక్షిణ భారతదేశ రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన పరిస్థితులు భారత్లో పునరావృతం కాకూడదని చింతా మోహన్ పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీకి చంద్రబాబు తొత్తుగా మారి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించారంటూ తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలతోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ధ్వజమెత్తారు. అధికారాన్ని నిలబెట్టుకునే రాజకీయ వ్యూహంలో భాగంగానే అధికార పార్టీ ఈ బిల్లును తీసుకొచ్చిందని చింతా మోహన్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పంచాయతీ ఎన్నికల్లో కూటమి జోరు.. అవమానంతో రెచ్చిపోతున్న వైసీపీ..!
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!