Share News

హౌతీ దాడుల భయం.. సౌదీ అరేబియాకు పాక్ సైన్యం..

ABN , Publish Date - Nov 29 , 2026 | 07:07 PM

పశ్చిమాసియలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది.

హౌతీ దాడుల భయం.. సౌదీ అరేబియాకు పాక్ సైన్యం..
pakistan army chief Asim Munir

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ తన సైనికులను సౌదీ అరేబియాకు పంపించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ సైన్యం ఆదివారం (నవంబరు 29) అధికారికంగా ప్రకటించింది (Pakistan Army in Saudi Arabia).


శనివారం పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, సీనియర్ సైనిక అధికారులు, పాకిస్థాన్‌లోని సౌదీ రాయబారి రాజెహ్ తామి అల్‌బుగామీ సమక్షంలో సైనికుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సౌదీ అరేబియా భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాక్ సైన్యం ప్రకటించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకార ఒప్పందాల ప్రకారమే తమ సైనికులు సౌదీ భూభాగంలో విధులు నిర్వహిస్తారని స్పష్టం చేసింది (Pakistan Saudi Arabia Defence Agreement).


ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి (Mecca Joint Defence Agreement). ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. పరస్పరం రక్షణ సహకారం అందించుకోవడం, సైనిక బలగాలు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.


ఇవి కూడా చదవండి..

అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..


భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 29 , 2026 | 07:17 PM