Share News

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నిక..

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:08 PM

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై వాషింగ్టన్‌లోని ప్రవాసాంధ్రులు అభినందనలు తెలిపారు.

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నిక..

వాషింగ్టన్: అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంస్థగా, 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) వైస్ ప్రెసిడెంట్‌గా యష్ బొడ్డులూరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వాషింగ్టన్‌లోని పలువురు ప్రవాసాంధ్రులు అభినందనలు తెలిపారు.

ఐదు దశాబ్దాలకు పైగా అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పేర్కొన్నారు.


గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన యష్ బొడ్డులూరి యువకుడిగా, ఉన్నత విద్యావంతుడిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలపై తన గొంతును వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు.

GWTCSలో కొత్త బాధ్యతలతో యష్ బొడ్డులూరి సేవా ప్రయాణం మరింత విస్తరించాలని ప్రవాసాంధ్రులు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు, సమాజానికి మరిన్ని సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.


Also Read:

బంగ్లాదేశ్‌ క్రికెటర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

స్టాలిన్.. దేశం గురించి ఆలోచించండి: రాహుల్ గాంధీ

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

Updated Date - Nov 28 , 2026 | 10:13 PM