Share News

గంభీర్‌కు ముందుంది అసలైన పరీక్ష: గంగూలీ

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:36 PM

రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్‌గా గౌతమ్ గంభీర్ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు వన్డే ప్రపంచ కప్2027 రూపంలో అసలైన సవాల్ ఎదురుకానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

గంభీర్‌కు ముందుంది అసలైన పరీక్ష: గంగూలీ
Sourav Ganguly warning Gambhir

స్పోర్ట్ డెస్క్: గౌతమ్ గంభీర్ ఇటీవల రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి టీమిండియా హెచ్ కోచ్‌గా రికార్డు సృష్టించాడు. అతడి ఆధ్వర్యంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. అనేక అవరోధాలను అధిగమించిన భారత్ జట్టు.. సరైన సమయంలో వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌కు భారత దిగ్గజ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక గంభీర్ కు దాదా పలు సలహాలు కూడా ఇచ్చాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ గంభీర్‌కు 'అసలైన అగ్ని పరీక్ష' అని దాదా హెచ్చరించాడు.


బొరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ..' వ‌చ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచ కప్ రూపంలో గంభీర్‌కు అస‌లైన ప‌రీక్ష ఎదురుకానుంది. అక్కడి పరిస్థితులు జట్టును, కోచ్‌ను తీవ్రంగా పరీక్షిస్తాయి. అయితే గంభీర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రస్తుత జ‌ట్టుపై నాకు పూర్తి న‌మ్మకం ఉంది. అత‌డు శిక్షకుడిగా మ‌రోసారి కచ్చితంగా విజయం సాధిస్తాడు ' అని గంగూలీ పేర్కొన్నాడు.


అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. 'టెస్టుల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా పిచ్ ఎలా ఉంటుందనే దానిపై ఎక్కువగా ఆలోచన చేయకపోవడం మంచిది. పిచ్‌ను పిన్ టూ పిన్ పరీక్షించి చూడటం మానేయాలి. స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదు. మంచి పిచ్‌పై ఆడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇంగ్లండ్‌ సిరీస్ ఫలితాలే అందుకు నిదర్శనం' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడ చదవండి:

వింత రనౌట్.. హెల్మెట్ నేలకేసి కొట్టిన పాక్ ప్లేయర్

బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకున్న పాకిస్థాన్

Updated Date - Mar 14 , 2026 | 01:53 PM