ముంబై జట్టుకు నాయకత్వం వహించడం ఎప్పుడూ గర్వకారణమే: రోహిత్
ABN , Publish Date - Nov 27 , 2026 | 09:55 PM
ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ మరోసారి జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్ 2027కు కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం తొలిసారి స్పందించిన హిట్‌మ్యాన్.. రాబోయే సీజన్‌లో జట్టుతో కలిసి మధుర క్షణాలను అందిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నియమితులయ్యాడు. మూడేళ్ల విరామం తర్వాత అతడు తిరిగి జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ముంబై యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అవ్వడంతో రోహిత్‌కే మళ్లీ జట్టు పగ్గాలను కట్టబెట్టారు. తాను జట్టుకు ఎంపిక కావడంపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు.
'ముంబై జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎప్పుడూ గర్వకారణమే. రాబోయే సీజన్ గురించి నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలతో జరిగిన చర్చలు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఏం సాధించగలమో నాకు పూర్తి నమ్మకం ఉంది. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లకు నేను సిద్ధంగా ఉన్నాను. మా పల్టన్ సంబరాలు చేసుకునేలా ఎన్నో మధుర క్షణాలను అందించడానికి కృషి చేస్తాము. మాదైన శైలిలో క్రికెట్ ఆడటం, కలిసికట్టుగా పోరాడటంపైనే మా దృష్టి పెట్టింది' అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయానికి వస్తే.. తొలుత ఈ రేసులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ముంబై ఫ్రాంచైజీ అనుభవజ్ఞుడైన రోహిత్ వైపే మొగ్గు చూపింది. కాగా ముంబై కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. హిట్‌మ్యాన్ 2013 నుంచి 2020 మధ్య ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లను అందించాడు. 2024 వరకు ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్
ఓవరాక్షన్ తగ్గించుకో.. హర్షిత్ రాణాపై నెటిజన్లు ఫైర్!