అభిమానిని తోసేసిన సెక్యూరిటీ.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే?
ABN , Publish Date - Jun 22 , 2026 | 08:09 PM
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను ముగించుకున్న రోహిత్ శర్మ.. ఇటీవలే తన స్వస్థలం ముంబైకి చేరుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి ఆటకే కాకుండా.. వ్యక్తిత్వానికి చాలా మంది అభిమానులుగా మారారు. తన కోసం వచ్చిన ఫ్యాన్సు అస్సలు నిరుత్సాహానికి గురి చేయడు. అలానే ఎవరైన అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంటాడు. గతంలో తాను కొట్టిన బంతి ఓ అభిమానికి తగలడంతో చాలా బాధపడ్డ రోహిత్.. తర్వాత బాధితుడిని కలిసి ..క్రికెట్ ప్రియుల మనసు గెలిచాడు. తాజాగా మరోసారి రోహిత్ చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. రోహిత్ ను చూసేందుకు వచ్చిన భద్రతా సిబ్బందిలోని ఓ వ్యక్తి నెట్టేశాడు. దీంతో వెంటనే సీరియస్ అయిన రోహిత్.. సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను ముగించుకున్న రోహిత్ శర్మ.. ఇటీవలే తన స్వస్థలం ముంబైకి చేరుకున్నాడు. అయితే ముంబై విమానాశ్రయంలో అభిమానులు సెల్ఫీల కోసం రోహిత్ చుట్టుముట్టారు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు దగ్గరగా ఓ పెద్దాయన వచ్చాడు. ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డ్ పక్కకు నెట్టేశాడు. భద్రతా సిబ్బంది వ్యక్తి దురుసు ప్రవర్తనపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సదరు సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ మందలించాడు. అభిమానుల పట్ల అలా ప్రవర్తించ వద్దని సూచించాడు.
ఈ చర్యతో ఫ్యాన్స్ పట్ల తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నాడని హిట్ మెన్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ ఘటనను ఓ ఫొటోగ్రాఫర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్‌లో 16 పరుగులతో రనౌట్‌గా కాగా.. రెండో మ్యాచ్‌లో 48, మూడో మ్యాచ్‌లో 79 పరుగులతో రాణించాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టీజీ20 లీగ్2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్
టీమిండియా ఓటమిపై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు..