Share News

పెళ్లికి ముందే బ్రేకప్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 02:14 AM

పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ తమ బంధానికి ముగింపు పలికారు. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట భవిష్యత్‌ లక్ష్యాలు భిన్నంగా ఉండటంతో విడిపోతున్నట్లు ఆకృతి తెలిపింది.

పెళ్లికి ముందే బ్రేకప్‌
Prithvi Shaw, Aakriti Agarwal

  • విడిపోయిన పృథ్వీషా జోడీ

ముంబై: క్రికెటర్‌ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్‌ విడిపోయారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందే తమ బంధానికి ము గింపు పలికింది. ఈమేరకు ఆకృతి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘భవిష్యత్‌కు సంబంధించి మా లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి.


దీంతో ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం’ అని తెలిపింది. అటు ఈ బ్రేక్‌పపై పృథ్వీ షా అధికారికంగా స్పందించకపోయినా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌ మినహా అన్నింటినీ తొలగించడం గమనార్హం. గత జూలైలోనే తాను మోసపోయానంటూ ఆకృతి చేసిన పోస్ట్‌తో వీరి బంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా

అభిషేక్‌ విధ్వంసం

Updated Date - Sep 18 , 2026 | 02:16 AM