Share News

అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా

ABN , Publish Date - Sep 17 , 2026 | 01:45 PM

భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పదవీకాలానికి పొడిగింపు లభించే అవకాశం తక్కువగా ఉందని బీసీసీఐ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.

అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా
Ajit Agarkar

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పదవీకాలానికి పొడిగింపు లభించే అవకాశం తక్కువగా ఉందని బీసీసీఐ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. చీఫ్ సెలెక్టర్‌ పదవి కోసం మాజీ భారత క్రికెటర్లు పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా పోటీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి (Ajit Agarkar extension).


అగార్కర్ ప్రస్తుతం భారత సీనియర్ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఒప్పందం అక్టోబర్ 4తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించే అవకాశం ఉందన్న గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన పదవీకాలానికి పొడిగింపు లభించే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. శుక్రవారం బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది (BCCI selection committee).


బుధవారం జరిగిన సెలెక్షన్ సమావేశమే అగార్కర్ అధ్యక్షతన జరిగిన చివరి సమావేశం అయి ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి (BCCI chief selector). అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్, మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఐపీఎల్‌లోనూ విజయవంతమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరికి చీఫ్ సెలక్టర్ పదవి దక్కే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 17 , 2026 | 01:45 PM