Share News

అభిషేక్‌ విధ్వంసం

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:45 AM

అఫ్ఘానిస్థాన్‌పై మూడో టీ20లో అభిషేక్‌ శర్మ 30 బంతుల్లో శతకం బాది 108 పరుగులు చేశాడు. భారత్‌ 127 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

అభిషేక్‌ విధ్వంసం
Abhishek Sharma

  • 30 బంతుల్లోనే శతకం జూ 3-0తో భారత్‌ క్లీన్‌స్వీ్‌ప్

  • 127 రన్స్‌తో అఫ్ఘాన్‌ చిత్తు జూ నితీశ్‌, బిష్ణోయ్‌లకు మూడేసి వికెట్లు

  • మూడో టీ20

న్యూఢిల్లీ: డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108) మరోసారి విజృంభించాడు. గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 30 బంతుల్లోనే రికార్డు శతకం బాదేశాడు. అతడి ధాటికి సంజూ శాంసన్‌ (35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) నిలకడ తోడయ్యింది. అనంతరం భారత బౌలర్ల విజృంభణకు అఫ్ఘాన్‌ బ్యాటర్లంతా కలిసి అభిషేక్‌ స్కోరును కూడా అందుకోలేకపోయారు. దీంతో భారత్‌ 127 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 3-0తో ఈ సిరీ్‌సను సైతం క్లీన్‌స్వీప్‌ చేసింది. ముుందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 221 పరుగులు చేసింది. శ్రేయాస్‌ (29) ఫర్వాలేదనిపించాడు. ఒమర్జాయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్‌ 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. జద్రాన్‌ (25) టాప్‌ స్కోరర్‌. నితీశ్‌, బిష్ణోయ్‌లకు మూడేసి.. అక్షర్‌కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ కూడా అభిషేక్‌కు దక్కింది.


పేకమేడలా..: భారీ ఛేదనలో అఫ్ఘాన్‌ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కనీసం వంద పరుగులైనా చేయలేక చతికిలపడింది. నాలుగో ఓవర్‌లోనే గుర్బాజ్‌ను స్పిన్నర్‌ అక్షర్‌ అవుట్‌ చేయడంతో తడబాటు ఆరంభమైంది. పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. నితీశ్‌ 12వ ఓవర్‌లో ఏకంగా నబీ (8), ఒమర్జాయ్‌ (17), ముజీబుర్‌ (0)లను పెవిలియన్‌కు చేర్చగా అఫ్ఘాన్‌ 82/8 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. చివరకు మరో 35 బంతులుండగానే భారత్‌ మ్యాచ్‌ను ముగించింది.


ఎడా పెడా: టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రఫ్ఫాడించాడు. రెండో ఓవర్‌లో 6,4,6తో మొదలెట్టిన అభిషేక్‌ మూడో ఓవర్‌లో 23 పరుగులు చేశాడు. ఇక నబీ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లోనైతే 29 రన్స్‌ సమకూరాయి. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 100 పరుగులతో నిలిచింది. అభిషేక్‌ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి 30 బంతుల్లోనే శతకం బాదేశాడు. అయితే కాసేపటికే స్పిన్నర్‌ రషీద్‌ అతడి విధ్వంసానికి బ్రేక్‌ వేయడంతో తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అఫ్ఘాన్‌ బౌలర్లు పట్టు సాధించడంతో భారత్‌ వికెట్లను వేగంగానే కోల్పోయింది. తిలక్‌ (2) రనౌట్‌ కాగా.. శాంసన్‌ను ఒమర్జాయ్‌ అవుట్‌ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.


స్కోరుబోర్డు: భారత్‌: శాంసన్‌ (సి) రషీద్‌ (బి) ఒమర్జాయ్‌ 50, అభిషేక్‌ (సి) గుర్బాజ్‌ (బి) రషీద్‌ 108, తిలక్‌ (రనౌట్‌) 2, శ్రేయాస్‌ (రనౌట్‌) 29, దూబే (సి) రషీద్‌ (బి) ఒమర్జాయ్‌ 14, ఇషాన్‌ (రనౌట్‌) 10, నితీశ్‌ (సి) నూర్‌ (బి) అహ్మద్‌జాయ్‌ 1, అక్షర్‌ (నాటౌట్‌) 5, బిష్ణోయ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 221/7; వికెట్ల పతనం: 1-142, 2-152, 3-164, 4-186, 5-205, 6-206, 7-218; బౌలింగ్‌: ఫరూఖి 4-0-39-0, ఒమర్జాయ్‌ 3-0-27-2, ముజీబుర్‌ 4-0-45-0, నబీ 1-0-29-0, రషీద్‌ 4-0-43-1, అహ్మద్‌జాయ్‌ 4-0-38-1.


అఫ్ఘాన్‌: గుర్బాజ్‌ (బి) అక్షర్‌ 15, జద్రాన్‌ (సి) ఇషాన్‌ (బి) యష్‌ 25, సెడికుల్లా (సి) అభిషేక్‌ (బి) అక్షర్‌ 1, రసూలి (బి) బుమ్రా 0, ఒమర్జాయ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) నితీశ్‌ 17, నూర్‌ ఉల్‌ (సి) నితీశ్‌ (బి) బిష్ణోయ్‌ 11, నబీ (బి) నితీశ్‌ 8, రషీద్‌ (బి) బిష్ణోయ్‌ 6, ముజీబుర్‌ (బి) నితీశ్‌ 0, అహ్మద్‌జాయ్‌ (సి) అక్షర్‌ (బి) బిష్ణోయ్‌ 6, ఫరూఖి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 14.1 ఓవర్లలో 94 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-31, 2-33, 3-39, 4-47, 5-70, 6-81, 7-82, 8-82, 9-89, 10-94. బౌలింగ్‌: నితీశ్‌ 4-0-25-3, బుమ్రా 2-0-16-1, యష్‌ 2-0-17-1, అక్షర్‌ 3-0-9-2, బిష్ణోయ్‌ 3.1-0-26-3.


  • పురుషుల టీ20 పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు (76) చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్‌

  • ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (11) బాదిన రెండో భారత ఆటగాడిగా అభిషేక్‌. తొలి స్థానం (13) కూడా తన పేరిటే ఉండడం విశేషం.

  • తమ టీ20 చరిత్రలో అఫ్ఘాన్‌ జట్టుకిదే భారీ ఓటమి (127 రన్స్‌ తేడాతో).

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు

సాహిల్‌ చౌహాన్

27 బంతుల్లో

ఎస్తోనియా

ముహమ్మద్‌ ఫహాద్‌

29 బంతుల్లో

తుర్కియే

అభిషేక్‌ శర్మ

30 బంతుల్లో

భారత్‌

జాన్‌ నికోల్‌

33 బంతుల్లో

నమీబియా

సికిందర్‌ రజా

33 బంతుల్లో

జింబాబ్వే

ఫిన్‌ ఆలెన్‌

33 బంతుల్లో

న్యూజిలాండ్‌


ఈ వార్తలనూ చదవండి:

అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా

వైభవ్‌ ఆడతాడా?

Updated Date - Sep 18 , 2026 | 01:49 AM