జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:37 AM
ఐదో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ వచ్చేసింది. ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి...
న్యూఢిల్లీ: ఐదో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) షెడ్యూల్ వచ్చేసింది. ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. ఇక, డబ్ల్యూపీఎల్ కోసం క్రికెటర్ల వేలాన్ని ఈ ఏడాది అక్టోబరు 28న కేరళంలోని కొచ్చి వేదికగా నిర్వహించనున్నట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. కాగా, డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే నగరాల గురించి మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇక, ఫ్రాంచైజీలు క్రీడాకారిణులను అట్టిపెట్టుకోవడం లేదా వదిలేయడంపై వివరాలు వెల్లడించేందుకు ఈనెల 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు