వైభవ్ ఆడతాడా?
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:58 AM
అదిరే ఆటతో ఈపాటికే 2-0తో పొట్టి సిరీ్‌సను చేజిక్కించుకొన్న భారత్.. బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకొంటోంది. ఈ నేపథ్యంలో గురువారం అఫ్ఘానిస్థాన్‌తో..
రాత్రి 7.30 నుంచి
సోనీ స్పోర్ట్స్‌లో
‘బెంచ్’ను పరీక్షించే ఆలోచనలో భారత్
నేడు అఫ్ఘాన్‌తో మూడో టీ20
న్యూఢిల్లీ: అదిరే ఆటతో ఈపాటికే 2-0తో పొట్టి సిరీ్‌సను చేజిక్కించుకొన్న భారత్.. బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకొంటోంది. ఈ నేపథ్యంలో గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడో, ఆఖరి టీ20లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే స్వదేశంలో టీమిండియా తరఫున వైభవ్‌కు ఇదే తొలి మ్యాచ్ కానుంది. సొంతగడ్డపై ఆడుతుండడంతో భారత జోరుకు అఫ్ఘాన్ తేలిపోయింది. ఇప్పటికే సిరీ్‌స నెగ్గినందున మూడో మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉందని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. అలాగే ఆసియా క్రీడల ముందు మిగతా వారికి కూడా తగిన ప్రాక్టీస్ లభించే అవకాశం ఉంది. అయితే, కుదురుకున్న ఓపెనర్లు శాంసన్, అభిషేక్‌ను మార్చడానికి మేనేజ్‌మెంట్ సుముఖంగా లేదని సమాచారం. దీంతో ఇషాన్ కిషన్‌కు విశ్రాంతినిచ్చి.. ఆ స్థానంలో సూర్యవంశీని ఆడిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయ్య ర్, తిలక్ వర్మ మరింత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక, ఆల్‌రౌండర్లు నితీశ్, శివం దూబేలు గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు దిగలేదు. కానీ, హార్దిక్ పాండ్యాకు బ్యాక్‌పగా భావిస్తున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెండో మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరవడం జట్టుకు ఊరటనిచ్చేదే. గాయపడిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్ ఫర్వాలేదనిపించుకొన్నాడు. కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్‌తోపాటు పేసర్ యశ్ ఠాకూర్‌ను పరీక్షించాలి.
పరువు కోసం..: మరోవైపు పొట్టి ఫార్మాట్‌లో గట్టిజట్టుగా భావిస్తున్న అఫ్ఘానిస్థాన్.. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేక పోతోంది. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు చేజార్చుకోవడంతో.. స్కోరుపై ఆ ప్రభావం పడుతోంది. అయితే, ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకొంటోంది. ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకొని 200 పరుగులు చేస్తే.. టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. పేసర్ నవీనుల్ హక్ ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని జట్టులోకి తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పిచ్/వాతావరణం
వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. మైదానం వైశాల్యం కూడా తక్కువగా ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో వర్షం కురిసే చాన్సులు పరిమితంగానే ఉన్నాయి.
జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, శాంసన్, ఇషాన్/వైభవ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీశ్, బిష్ణోయ్, దూబే/యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్, బుమ్రా.
అఫ్ఘానిస్థాన్: రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), సెడికుల్లా అటల్, గుల్బదిన్ నైబ్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నవీనులు, ఫజల్/అబ్దుల్లా ఒమర్జాయ్.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు