పాండ్యా, పంత్‌కు నిరాశ
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:53 AM
పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధిర్, జమ్మూ పేసర్ ఆకిబ్ నబీకి తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. స్వదేశంలో విండీస్‌తోజరిగే వన్డే, టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను...
నమన్, నబీలకు పిలుపు
వన్డే జట్టులో నితీశ్
జడేజా రీఎంట్రీ
విండీస్ తో వన్డే, టీ20లకు భారత జట్లు
న్యూఢిల్లీ: పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధిర్, జమ్మూ పేసర్ ఆకిబ్ నబీకి తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. స్వదేశంలో విండీస్‌తో జరిగే వన్డే, టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. అయితే, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌ను వేర్వేరు కారణాలతో పరిగణనలోకి తీసుకోలేదు. భారత పర్యటనలో విండీస్ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. కాగా, ఆసియా క్రీడలకు ప్రకటించిన జట్టునే టీ20లకు దాదాపుగా ఎంపిక చేశారు. యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్ స్థానాల్లో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఈ నెల 20న పాండ్యా ఫిట్‌నెస్ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, అతడు భారత్-ఎ తరఫున ఆడి మ్యాచ్ ఫిట్‌నె్‌సను నిరూపించుకొన్న తర్వాతనే సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నారు. పాండ్యా గైర్హాజరీలో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను ఆసియాడ్ జట్టు నుంచి తప్పించివిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ, కోహ్లీ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్ టూర్‌కు దూరమైన రవీంద్ర జడేజాకు మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో నమన్ ఆకట్టుకొనే ప్రదర్శన చేయగా.. కౌంటీ క్రికెట్‌లో సర్రే తరఫున నబీ రాణించాడు. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టు కెప్టెన్‌గా పంత్‌ను ప్రకటించారు.
వన్డే జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), జురెల్, నితీశ్, జడేజా, కుల్దీప్, ప్రసిద్ధ్, గుర్నూర్ బ్రార్, సిరాజ్, ఆకిబ్ నబీ, జైస్వాల్, నమన్ ధిర్.
టీ20 జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ (వికెట్ కీపర్), శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, కుల్దీప్, అక్షర్, వాషింగ్టన్, బిష్ణోయ్, నితీశ్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.
విండీస్‌తో మ్యాచ్‌ల షెడ్యూల్
ఈ నెల 27 తొలి వన్డే తిరువనంతపురం
ఈ నెల 30 రెండో వన్డే గువాహటి
అక్టోబరు 3 మూడో వన్డే న్యూ చండీగఢ్
అక్టోబరు 6 తొలి టీ20 లఖ్‌నవూ
9 రెండో టీ20 రాంచీ
11 మూడో టీ20 ఇండోర్
14 నాలుగో టీ20 హైదరాబాద్
17 ఐదో టీ20 బెంగళూరు
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు