అరుదైన మైలురాయి...టీమిండియా సరసన పాకిస్థాన్
ABN , Publish Date - May 30 , 2026 | 07:52 PM
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే పాకిస్థాన్‌కు 1000వ మ్యాచ్ కావడం విశేషం.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే పాకిస్థాన్‌కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్‌లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. తొలి స్థానంలో భారత జట్టు ఉంది. వెయ్యి వన్డే మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో టీమిండియా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ 1075 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అలానే 1020 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.
తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్థాన్ చేరింది. 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగా ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. పాక్ ఆడుతున్న ఈ1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. వెయ్యి వన్డే మ్యాచ్‌లు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1020 మ్యాచ్‌ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, భారత్ (1075 మ్యాచ్‌ల్లో 571 విజయాలు), పాకిస్థాన్ (999 మ్యాచ్‌ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
పాకిస్థాన్ తమ మొట్టమొదటి వన్డేను 1973లో ఫిబ్రవరి 11న న్యూజిలాండ్‌తో ఆడింది. 1000 వన్డేలను పూర్తి చేయడానికి పాక్‌కు 53 సంవత్సరాలు పట్టింది. ఈ 53 ఏళ్ల కాలంలో పాకిస్థాన్ 12 ప్రపంచ కప్‌లు ఆడింది. తొలిసారి 1975 వరల్డ్ కప్‌లో పాక్ పాల్గొన్నది. 1992లో మాత్రమే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది పాక్.
ఇవి కూడా చదవండి:
రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్
ఐపీఎల్2026: సన్ రైజర్స్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్